చంద్రబాబు చెప్పులకు కేటీఆర్‌ దండంపెట్టి గెలిచిండు : రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ స్థానికేతరుడని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారని.. మరి హరీశ్‌రావుది సిద్ధిపేట కాదని, కేటీఆర్‌ ది సిరిసిల్ల కాదని.. వారు కూడా స్థానికేతరులనేని గుర్తు చేశారు. స్థానికేతరులైన కేటీఆర్‌, హరీశ్‌రావులకు ప్రజలు అవకాశం ఇస్తే విర్రవీగుతున్నారన్నారు.

అంతేకాకుండా 2009 ఎన్నికల్లో కేకే మహేందర్‌ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని చీమలు పెట్టిన పుట్టను.. పాములు ఆక్రమించుకున్నట్లు.. అమెరికా హోటల్లో చిప్పలు కడుక్కొనే కేటీఆర్‌ ఉన్నపలంగా వచ్చి కేకే మహేందర్‌ రెడ్డి సీటును గుంజుకున్నారని ఆయన ఉద్ఘాటించారు. దీనితో పాటు ఆనాటి 2009 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పులకు దండం పెట్టి ప్రజల్లోకి వెళితేనే కేటీఆర్‌ గెలిచారంటూ తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బల్మూరి వెంకట్ ను గెలిపించి కేసీఆర్‌ తగిన బుద్ది చెప్పాలన్నారు. బల్మూరి వెంకట్‌ 5 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన మోసంపై పోరాటం చేస్తున్న వ్యక్తి అని అన్నారు. ఇంటికో ఓటు కాంగ్రెస్‌ పార్టీకి వేసి బల్మూరి వెంకట్‌ ను గెలిపించాలని రేవంత్‌ రెడ్డి కోరారు.

Related Articles

Latest Articles