సిరిసిల్లలో కూడా దళితులను లారీలతో గుద్ది చంపారు : రేవంత్ రెడ్డి

యూపీ లో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేసింది అని రేవంత్ రెడ్డి అన్నారు. దీని పై మోడీ అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ సమస్య కాదు 80శాతం మంది రైతుల సమస్య. 80కోట్లమంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారు. రైతులు తిరగబడి ఎర్రకోట పై జెండా ఎగరేశారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్ కు చలిజ్వరం పట్టుకుంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారు. దేశ ప్రజల మన్ కీ బాత్ విను మోడీ అని సూచించారు.

ఇక సిరిసిల్లలో కూడా దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారు అని చెప్పారు రేవంత్ రెడ్డి. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలి. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీకి లొంగిపోయారు. మోదీ, కేసీఆర్ ను బొందపెడితేనే దేశంలో రాష్ట్రంలో శాంతి ఉంటుంది. మోదీ అమిత్ షాలు రైతుల హత్యలను ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలి అని పేర్కొన్నారు.

-Advertisement-సిరిసిల్లలో కూడా దళితులను లారీలతో గుద్ది చంపారు : రేవంత్ రెడ్డి

Related Articles

Latest Articles