టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమంలో…చాలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంబేద్కర్‌ విగ్రహం వైపు ర్యాలీగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బయలు దేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇందిరా పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

read also : సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ

ధర్నాచౌక్‌ నుంచి కాంగ్రెస్‌ నేతలు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు పోలీసులు. కార్యకర్తల భుజాలపై ఎక్కి మరీ రేవంత్‌ రెడ్డి బారికేడ్లు దాటారు. అటు బారికేడ్లను కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలు తోసివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో పాటు…మధు యాష్కీ మరియు అంజన్ కుమార్‌ యాదవ్‌ లను అరెస్ట్ చేశారు పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-