మూడు రాజధానులపై వెనక్కి తగ్గం : మంత్రి బొత్స

అమరావతి రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని… ఎవరికో భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు బొత్స. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభ లో స్పష్టంగా ప్రకటన చేశారని… అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చామన్నారు. అపోహలు, అభిప్రాయ బేధాలతోనే అమలు్లో ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు.

ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా మళ్ళీ బిల్లును తీసుకు వస్తామని… మూడు ప్రాంతాల అభివృద్ధి టకి మళ్ళీ వేగంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అమరావతి రైతుల మనసులో ఉన్నవన్ని చేయలనంటే ప్రభుత్వానికి ఎలా సాధ్యం..? అని ప్రశ్నిచారు. అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఉంది కాని చేయనీయకుండా అడ్డుకున్నారు. బీజేపీది రెండు నాల్కల ధోరణి అని ఫైర్ అయ్యారు. అందుకే ఇవాళ రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారని… మా పార్టీ ముందు నుంచి ఒకే ధోరణితో ఉందన్నారు.

Related Articles

Latest Articles