రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్ కోట‌య్య మృతి.. ఆనంద‌య్య మందు ఇచ్చారు..!

ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉన్న స‌మ‌యంలో.. ఆనంద‌య్య మందు తీసుకున్న‌ కొన్ని నిమిషాల్లోనే కోలుకున్న‌ట్టు మీడియాకు తెలిపిన రిటైర్డ్ హెడ్ మాస్ట‌ర్ కోట‌య్య ఇక లేరు.. ఆనందయ్య మందు తీసుకున్న త‌ర్వాత వెంట‌నే న‌యం అయిన‌ట్టు అనిపించినా.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ ఆయ‌న నెల్లూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరారు.. ఇదే స‌మ‌యంలో.. ఆనంద‌య్య మందు విక‌టించ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి.. ఓ ద‌శ‌లో చ‌నిపోయార‌నే ప్ర‌చారం కూడా సాగింది.. కానీ, ఇంత‌కాలం ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన కోట‌య్య‌.. ఇవాళ ఉద‌యం చ‌నిపోగా.. గుట్టుచ‌ప్పుడు కాకుండా మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం..

కోట మండ‌లం తిన్నెలపొడికి చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్ కోట‌య్య‌… ఆనందయ్య వద్ద కంట్లో చుక్కలు వేసుకుని బ్రతికానన్న వీడియోతో అప్ప‌ట్లో వైర‌ల్‌గా మారిపోయింది.. కంట్లో చుక్కల మందు వేసుకున్న వారం రోజులకు ఆరోగ్యం క్షిణించి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కోటయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జిజిహెచ్ కి త‌ర‌లించారు. వారం రోజుల నుండి చికిత్స పొందుతూ నెల్లూరు జిజిహెచ్ లో ఇవాళ మ‌ర‌ణించారు కోటయ్య.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-