ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో ఆంక్ష‌లు… నో ఎంట్రీ బోర్డులు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.  అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని అమ‌రావ‌తి ఉద్య‌మానికి ప్ర‌జ‌లు న‌డుం బిగించి నేటికి 600 రోజులు పూర్త‌యింది.  ఈ సంద‌ర్భంగా  రాజ‌ధానిలోని హైకోర్టు నుంచి మంగ‌ళ‌గిరిలోని ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి వారి దేవ‌స్థానం వ‌ర‌కు ర్యాలీని నిర్వ‌హించాల‌ని అమ‌రావ‌తి ప్రాంత రైతులు నిర్ణ‌యం తీసుకున్నారు.  అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు.  ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో పెద్దఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.  గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి స్థానికుల‌ను మాత్ర‌మే గ్రామంలోకి అనుమ‌తిస్తున్నారు.  పోలీసులు అనుమ‌తించ‌క‌పోయినా న్యాయ‌స్తానం టు దేవ‌స్థానం ర్యాలీ చేప‌ట్టి తీరుతామ‌ని ఉద్య‌మ‌కారులు చెబుతున్నారు.  

Read: చిరు సినిమాకు కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ పెంచేసిందా ?

-Advertisement-ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో ఆంక్ష‌లు... నో ఎంట్రీ బోర్డులు...

Related Articles

Latest Articles