ఢిల్లీ అన్‌లాక్ః రేప‌టి నుంచి వాటికి అనుమ‌తి…

ఢిల్లీలో క‌రోనా మ‌హమ్మారి కేసులు క్ర‌మంగా తగ్గుతున్నాయి.  క‌నిష్టస్థాయికి కేసులు చేరుకోవ‌డంతో లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఇవ్వడం మొద‌లుపెట్టారు.  లాక్‌డౌన్ స‌డ‌లింపుల స‌మ‌యంలో కూడా కేసులు కేసులు పెద్ద‌గా న‌మోదుకావ‌డంలేదు.  దీంతో మ‌రిన్ని స‌డ‌లింపులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  రేప‌టి నుంచి 50శాతం సీటింగ్ కెపాసిటితో రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు అనుమ‌తులు మంజూరు చేశారు.  పెళ్లిళ్లు, అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికంటే ఎక్కువ మందికి అనుమ‌తి లేద‌ని ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.  ఇక ఢీల్లీలో పాఠ‌శాల‌లు, సినిమా హాల్స్ మూసే ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  థ‌ర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిది. 

-Advertisement-ఢిల్లీ అన్‌లాక్ః రేప‌టి నుంచి వాటికి అనుమ‌తి...

Related Articles

Latest Articles