సాయిరామ్ శంక‌ర్‌ బర్త్ డే సందర్భంగా ‘రీసౌండ్’ ఫ‌స్ట్ లుక్

కాస్తంత విరామం త‌ర్వాత హీరో సాయిరామ్ శంకర్ ఓ ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు. ఎస్.ఎస్. మురళీ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోమవారం సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, ఆ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రీసౌండ్ అని ప‌వ‌ర్‌ఫుల్‌, మాస్-అప్పీలింగ్ టైటిల్ ను ఖ‌రారు చేశారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, బాబీ రీసౌండ్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ ఫస్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే సాయిరామ్ శంక‌ర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేష‌న్‌లోని కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అంత‌కు ముందు పోలీసుల‌తో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన‌ట్లు పోస్టర్ బట్టీ తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీనిని తెరకెక్కిస్తున్న విషయం అర్థమౌతోంది. జె. సురేష్ రెడ్డి, బి. అయ్యప్ప రాజు, ఎన్‌.వి.ఎన్. రాజారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా సాయిప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రీసౌండ్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

Related Articles

Latest Articles

-Advertisement-