తొలిసారి దర్శకుడి వ్యాఖ్యానంతో ఓటీటీలో సినిమా

ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎవరు దానిని అందిస్తారో వారికి ప్రేక్షకాదరణ దక్కుతుంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘జీ 5’ అలాంటి ప్రయోగం చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతోంది. మన దేశంలో ఇలాంటి రిలీజ్ ఇదే ఫస్ట్. తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం.

వెబ్ సిరీస్‌, డైరెక్ట్‌ డిజిట‌ల్ రిలీజ్‌, ఒరిజిన‌ల్ మూవీస్‌ ఇలా వీక్షకులు కోరుకునే వాటిని అందిస్తూ వస్తోది జీ5. తెలుగు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తోంది. తెలుగులో గత ఏడాది పలు సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్ గా రిలీజ్ చేసింది. థియేటర్లలో హిట్ అయిన ‘రాజ రాజ చోర’ను విజయదశమికి, ‘శ్రీదేవి సోడా సెంటర్’ను దీపావళికి విడుదల చేసింది. ఇటీవల ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, దీనికి ముందు ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ రిలీజ్ చేసింది. ఈ 26న ‘రిపబ్లిక్’ సినిమాను విడుదల చేయనుంది.

సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ నిర్మించిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ తీసిన చిత్రమిది. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో!

సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే… తాను ఏ కోణంలో సదరు సన్నివేశం, సినిమా తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపించనుండటం మాత్రం కొత్త తరహా ప్రయోగమే. అటువంటి ప్రయత్నానికి ‘జీ 5’, దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు. మరి ఈ ప్రయోగం విజయవంతం అయితే రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను ఇలా డైరక్టర్స్, స్టార్స్ వాయిస్ తో చూడవచ్చు. ఆల్ ద బెస్ట్ చెబుదామా!

Related Articles

Latest Articles