రెండు రోజుల పాటు సంఘ్‌పరివార్‌ సమన్వయ సమావేశాలు

రేపు ఎల్లుండి సంఘ పరివార్ క్షేత్రాల కీలక సమన్వయ సమావే శాలను నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగర శివారులో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సమావేశాలకు వివిధ క్షేత్రాల ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. బీజేపీ, విహెచ్‌పీ, ఏబీవీపీ, బీఎంస్‌ తదితర సంస్థల నుంచి కొందరిని ఆహ్వనించను న్నట్టు వారు తెలిపారు. బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజే పీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షు డు లక్ష్మణ్‌ హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. వీరు రెండు రోజులపాటు అక్కడే బస చేస్తారన్నారు.

ఈ సమావేశాల్లో ఆయా క్షేత్రాల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు- భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నట్టు వారు తెలిపారు. ఆయా సంస్థలు తమ తమ క్షేత్రాల్లో ఏ మేరకు విస్తరిం చాయి… ఆయా క్షేత్రాల్లో వాటి ప్రభావం ఎంత అనే దాని పై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ నేతలు మార్గనిర్దేశనం చేయనున్నారు. రెండు రోజులపాటు ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ ముకుంద ఇక్కడే ఉండనున్నారు. తెలంగాణంలో మరింతగా బలపడేందుకు విస్తరించేందుకు ఈ సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.

Related Articles

Latest Articles