రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం

కరోనా మహమ్మారి దేశంలో మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. ఇంతకుముందు కంటే ఈసారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఇంట్లోనే కూర్చున్న వారికి కూడా కోవిడ్-19 పాజిటివ్ రావడం ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడి, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడంతో పాటు దానికి తగిన చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. రేణూతో పాటు ఆమె తనయుడు అఖీరా నందన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని రేణూ స్వయంగా వెల్లడించింది.

Read Also : కట్టప్పను ఎవరు చంపారు ?… ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్

“హలో… ఎక్కువగా ఇంట్లోనే ఉన్నప్పటికీ నాకు, అఖీరాకు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మేము ఇద్దరం ఇప్పుడు కోలుకుంటున్నాము. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను… కోవిడ్ థర్డ్ వేవ్ ని సీరియస్ గా తీసుకోండి. మాస్కులు ధరించండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. (నేను గత ఏడాదే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. అఖీరాకు మాత్రం ఒకటే డోస్ అయ్యింది. రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించాల్సిన సమయంలోనే కరోనా పాజిటివ్ అని తేలింది)” అంటూ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం

Related Articles

Latest Articles