ఉద్యోగుల‌పై వ్యాక్సినేష‌న్‌పై రిల‌య‌న్స్ కీల‌క నిర్ణ‌యం

అప‌ర‌కుభేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్… త‌మ‌ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు వ్యాక్సిన్ ఇచ్చే విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. త‌మ సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌తో పాటు.. వారి కుటుంబ స‌భ్యులు అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఈ కార్పొరేట్ దిగ్గ‌జం నిర్ణ‌యానికి వ‌చ్చింది.. దీని కోసం ప్ర‌త్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వ‌హించ‌నుంది.. రిల‌య‌న్స్‌తో పాటు.. దాని అనుబంధ, భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేయ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకుంది.. దీని కోసం దేశ‌వ్యాప్తంగా 880 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వ‌హించ‌నున్నారు.. ఇక‌, వ్యాక్సిన్‌ల కోసం ఉద్యోగులు కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉండ‌గా.. ఆ త‌ర్వాత రిలయన్స్ ఆన్‌లైన్ హెల్త్ కేర్ ప్లాట్‌ఫామ్‌ జియో హెల్త్ హబ్‌ ద్వారా సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల‌ని రిల‌య‌న్స్ వెల్ల‌డించింది. మ‌రోవైపు.. ఇప్ప‌టికే సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగులు ఎవ‌రైనా వ్యాక్సిన్ వేయించుకుంటే, దానికి అయిన ఖర్చులను చెల్లించాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తంగా దేశంలో జ‌ర‌గ‌నున్న అతిపెద్ద ప్రైవేట్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ రిల‌య‌న్స్ సంస్థ‌దే అని చెప్పాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-