గుడ్‌న్యూస్‌.. పట్టాలెక్కనున్న సాధారణ రైళ్లు..

కరోనా మహమ్మారి విజృంభణతో రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి… ప్రత్యేక రైళ్లు, ఆక్సిజన్‌ కోసం రైళ్లు తప్పితే.. సాధారణ రైళ్లు పట్టాలెక్కింది లేదు.. కానీ, రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పేసింది దక్షిణ మధ్య రైల్వే.. 82 రైళ్లను పునరుద్దరించేందుకు సిద్ధమైంది.. 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ కాగా 66 ప్యాసింజర్‌ రైళ్లను ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.. ప్యాసింజర్‌ రైలులో ప్రయాణానికి స్టేషన్‌లోనే టికెట్లు ఇవ్వనున్నారు అధికారులు… ఇక ఈ రైళ్లను తప్పనిసరిగా కోవిడ్‌ రూల్స్‌ను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా స్పష్టం చేశారు.. స్టేషన్లు, రైళ్లలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు.. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కేందుకు సిద్ధమయ్యాయి..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-