ఇలా చేయడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్- రెజీనా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో రెజీనా కాసాండ్రా ఒకరు. యంగ్ హీరోల సరసన నటిస్తూ మెప్పించిన ఈ బ్యూటీ ఇటీవల టాలీవుడ్ లో కొద్దిగా హవా తగ్గించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ లో బిజీగా మారిన హాట్ బ్యూటీ ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఐటెం గర్ల్ గా కనిపించి మెప్పించింది. చిరు సరసన గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేసిన ఈ అమ్మడు ఈ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక స్పెషల్ షో లో కనిపించిన రెజీనా శానా కష్టం సాంగ్ గురించి మాట్లాడుతూ ” నేను ఇదివరకు ఎప్పుడు ఇలాంటి సాంగ్ చేయలేదు.. కానీ, కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చి చిరంజీవి గారి పక్కన సాంగ్ చేయాలన్నప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాను.

నా లైఫ్ లో ఐటెం సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా. ఇక చిరు గారిని నేను ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదు. సెట్ లో మొదటి సారి కలిసినప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ, ఆయన యంగ్ జనరేషన్ వాళ్ళతో కలవడం ఆయనకు ఉత్సాహం తెప్పిస్తోంది. ఆయన చాలా గ్రేస్ ఫుల్ గా డాన్స్ చేస్తారు. చిరు గారితో కలిసి పనిచేయడం చాలా అద్భుతమైన అనుభవం. పాట చాలా బాగా వచ్చింది.. మీ అందరికి చాల బాగా నచ్చుతుంది.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. చిరు – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 4 న విడుదల కానుంది.

Related Articles

Latest Articles