క్రిప్టో క‌రెన్సీతో సినిమా టికెట్లు కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ట‌…

ఇప్పుడు ఎక్క‌డ చూసినా క్రిప్టో క‌రెన్సీ మాటే వినిపిప్తోంది.  త్వ‌రలోనే కేంద్రం అధికారిక డిజిట‌ల్ క‌రెన్సీకి సంబంధించి బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ది.  దీంతో ప్ర‌తి ఒక్క‌రూ క్రిప్టో క‌రెన్సీ అంటే ఏంటి అని తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు.  ఇక అమెరికాలో అధికారికంగా ఈ క‌రెన్సీకి ఆమోదం లేక‌పోయినా అక్క‌డ చ‌లామ‌ణి అవుతూనే ఉన్న‌ది.  టెస్లా కంపెనీ కార్ల‌ను క్రిప్లో క‌రెన్సీ ద్వారా కొనుగోలు చేసేందుకు అవ‌కాశం ఇచ్చింది.  

Read: ట‌మోటా మాత్ర‌మే కాదు ఇవికూడా మోతే…

కాగా ఇప్పుడు ప్ర‌ముఖ మూవీ థియేట‌ర్ చైన్ కూడా క్రిప్టో క‌రెన్సీపై ఓ సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకుంది.  ఇక నుంచి తాము క్రిప్టో క‌రెన్సీనీల‌కు కూడా టికెట్లు అమ్ముతామ‌ని ప్ర‌క‌టించింది.  బిట్‌కాయిన్‌, డోజికాయిన్‌, లైట్ కాయిన్ తో పాటుగా ఇత‌ర డిజిట‌ల్ క‌రెన్సీని తాము తీసుకుంటామని రీగ‌ల్ సినిమా తెలియ‌జేసింది.  ఇప్ప‌టికే ఏఎంసీ థియేట‌ర్స్ సంస్థ గ‌త నెల‌లో ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకున్న‌ది.  ఇప్పుడు రీగ‌ల్ థియేట‌ర్స్ సంస్థ కూడా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో క్రిప్టోక‌రెన్సీ విలువ, వినియోగం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  

Related Articles

Latest Articles