హైదరాబాద్ లో మూడు రోజులు రెడ్ అలర్ట్ : వాతావరణ శాఖ డైరెక్టర్

హైదరాబాద్ లో ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అని ఎన్టీవీతో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న అన్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

Related Articles

Latest Articles

-Advertisement-