ధాన్యం కొనుగోళ్లల్లో తెలంగాణ సరికొత్త రికార్డు…

ధాన్యం కొనుగోళ్లల్లో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది యాసంగి రికార్డును దాటాయి ధాన్యం కొనుగోళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా… ఈఏడాది 10 లక్షల మంది రైతుల నుండి 12,247 కోట్ల విలువచేసే 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. కానీ గత ఏడాది ఇదే సమయానికి 56.82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసింది ప్రభుత్వం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-