సర్పంచ్ భర్తపై తిరుగుబాటు !

వైసీపీకి చెంది‌న సర్పంచ్ భర్తపై వార్డ్ మెంబర్ తిరుగుబాటు చేసిన ఘటన రేపల్లె నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే
గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, ఉప్పూడి పంచాయతీకి చెందిన 8వ వార్డ్ మెంబర్ రాసిన లేఖ కలకలం సృష్టించింది. సర్పంచ్ భర్త ఇమ్మానియేల్ .. తనను ఐదు నెలలుగా అవమానిస్తున్నాడని ఆరోపిస్తూ ఉప్పూడి ఎనిమిదో వార్డ్ మెంబర్ పీ.హరీష్ బాబు లేఖలో పేర్కొన్నాడు. తన భార్యకు డ్వాక్రా యానిమేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు నెలలుగా ఇమ్మానియేల్ తిప్పించకున్నాడని హరీష్ బాబు చెప్తున్నాడు. ఐదు నెలల తర్వాత నీకు బ్యాగ్రౌండ్ లేదు.. ఏమి చేసుకుంటావో చేసుకో ఉద్యోగం ఇప్పించేది లేదని.. సర్పంచ్ భర్త ఇమ్మానియేల్ తనను హేళన చేసినట్లు దళితుడైన పీ.హరీష్ బాబు బహిరంగ లేఖ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈలేఖ రేపల్లె నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

సర్పంచ్ దంపతుల అరాచకాలు

మరోవైపు ఉప్పూడి సర్పంచ్ దంపతులు పంచాయతీలో అరాచకాలు సృష్టిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ‌ మాట వినని వారిపై సర్పంచ్ భర్త తప్పుడు కేసులుతో వేధిస్తున్నట్లు చెప్తున్నారు. తమను దిక్కరిస్తే.. పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు ఆపేస్తామని.. ఉపాధిహామీ పనులు, డ్వాక్రా గ్రూపల నుంచి తొలగిస్తామని సర్పంచ్ దంపతులు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గ్రామస్థులు చెప్తున్నారు. ఎదురుతిరిగితే తమకు పెద్దల అండ దండలు ఉన్నాయనీ తమతో పెట్టుకోవద్దని సర్పంచ్ దంపతులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ప్రస్తుత సర్పంచ్ పై గ్రామస్థులు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల‌ కంటే ముందే సర్పంచ్ కు ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాచి చట్టాన్ని మోసం చేశారని గ్రామస్థులు చెప్పారు. ప్రస్తుతం రేపల్లె కోర్టులో కేసు నడుస్తున్నట్లు చెప్తున్నారు. చట్టాన్ని మోసం చేస్తూ.‌. గ్రామస్థులను బెదిరించటం ఏంటని ఉప్పూడి పంచాయతీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

Latest Articles