అమెరికా తైవాన్‌కు స‌పోర్ట్ చేయ‌డం వెనుక అస‌లు కార‌ణం ఇదేనా…?

క‌రోనా స‌మ‌స్య‌కు ఇప్పుడిప్పుడే ప‌రిష్కారం దొరుకుతున్న‌ది.  ఈ స‌మయంలో రెండు స‌మ‌స్య‌లు ప్ర‌పంచాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి.  అందులో ఒక‌టి ఆఫ్ఘ‌న్ స‌మ‌స్య ఒక‌టి కాగా, రెండోది తైవాన్ స‌మ‌స్య‌.  ఆఫ్ఘ‌నిస్తాన్ ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక అక్కడి ప్ర‌జ‌ల ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి.  రెండు ద‌శాబ్ధాలు అమెరికా ద‌ళాలు ఆఫ్ఘ‌నిస్తాన్ లో ఉండి అక్క‌డి సైనికుల‌కు కావాల్సిన శిక్ష‌ణ‌ను అందించినా లాభం లేకుండా పోయింది.  ఈ స‌మ‌స్య త‌రువాత తైవాన్ స‌మ‌స్య ఇప్ప‌డు ప్ర‌పంచంలో కీల‌కంగా మారింది.  ఆర్థికంగా అభివృద్ధి చెందిన చైనా వ‌న్ చైనా విధానాన్ని అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది.  ఇందులో భాగంగా చైనా త‌న స‌రిహ‌ద్దుదైశ‌మైన తైవాన్‌పై క‌న్నేసింది.  ఎలాగైనా తైవాన్ ను సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది.

Read: యువ‌కుడి క‌ల నెర‌వేర్చిన ఆనంద్ మ‌హీంద్రా…నెటిజ‌న్లు ఫిదా…

చైనా సైనిక చ‌ర్య‌లు తీసుకుంటే తాము తైవాన్ త‌రుపున పోరాటం చేస్తామ‌ని అమెరికా చెబుతున్న‌ది.  తైవాన్ విష‌యంలో త‌మ నిర్ణ‌యం మార‌ద‌ని అమెరికా మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.  అమెరికా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక చాలా పెద్ద కార‌ణం ఉన్న‌ది. ప్ర‌పంచానికి కావాల్సిన నాణ్య‌మైన చిప్స్, సెమీకండక్ట‌ర్లను తైవాన్ త‌యారు చేస్తుంది.  అమెరికా టెక్నాల‌జీ కంపెనీలు వినియోగించే చిప్స్, సెమీకండ‌క్ట‌ర్లు తైవాన్ నుంచి దిగుమ‌తి చేసుకుంటాయి.  90 శాతం కంపెనీలు తైవాన్ పై ఆధార‌ప‌డ్డాయి.  

ఒక‌వేళ చైనా తైవాన్‌ను ఆక్ర‌మించుకుంటే అమెరికాకు ఎగుమ‌తి ఆగిపోతుంది.  అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థలో సింహ‌భాగం టెక్నాల‌జీపైనే ఉంటుంది.  అదే జ‌రిగితే అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్రంగా దెబ్బ‌తింటుంది.  కేవ‌లం ఒక్క అమెరికానే కాదు ప్ర‌పంచంలోని చాలా దేశాలు తైవాన్ నుంచే సెమీకండ‌క్ట‌ర్ల‌ను దిగుమ‌తి చేసుకుంటాయి.  అందుకే తైవాన్ విష‌యంలో చైనాను అమెరికాతో పాటుగా యూర‌ప్ దేశాలు సైతం వ్య‌తిరేకిస్తున్నాయి. 

Related Articles

Latest Articles