ఇండియాలో క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెర‌గ‌డానికి కార‌ణం ఇదేనా?

ఇండియాలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి అనేలోగా ఒక్క‌సారిగా క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెర‌గ‌డం ఆంధోళ‌న క‌లిగిస్తోంది.  24 గంట‌ల వ్వ‌వ‌ధిలో 6148 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  రోజువారి మ‌ర‌ణాల సంఖ్య‌కంటే 73 శాతం అధికంగా న‌మోదు కావ‌డంతో ప్ర‌జ‌లు ఆంధోళ‌న చెందుతున్నారు. బీహార్‌లోని పాట్నా హైకోర్టు చొర‌వ తీసుకొని క‌రోనా కేసులను రీ కౌంటింగ్ చేయాల‌ని ఆదేశించింది.  దీంతో అధికారులు రీ కౌంట్ చేసి లెక్క‌లు మార్చారు.  మంగ‌ళ‌వారం నాటికి బీహార్‌లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5500 ఉండ‌గా, స‌వ‌రించిన లెక్క‌ల త‌రువాత ఆ సంఖ్య 9,429కి చేరింది.  అంటే స‌వ‌ర‌ణ‌లో 3,921 మ‌ర‌ణాలు యాడ్ అయ్యాయి.  దీంతో బుధ‌వారం రోజు మ‌ర‌ణాల సంఖ్య‌లో వీటిని యాడ్ చేసింది.  దీంతో దేశంలో మ‌ర‌ణాల సంఖ్య ఒక్క‌సారిగా పెరిగింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-