ఫేస్‌బుక్ పేరు మార్పు వెన‌క కార‌ణం ఏంటి?

ఫేస్‌బుక్‌పై గ‌త కొన్ని రోజులుగా అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఫేస్‌బుక్ పేరును మార్చుకోబోతున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  ఫేస్‌బుక్ కొత్త పేరుపై యావ‌త్ ప్ర‌పంచం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ది.  ఫేస్‌బుక్ త్వ‌ర‌లోనే మోటావ‌ర్స్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ద‌ని,   మోటా అనే పేరుతో కొత్తగా లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఆ సంస్థ మాజీ సివిక్ చీఫ్ తెలిపారు.  సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ కొంత‌మంది వ్య‌క్తుల కోస‌మే ప‌నిచేస్తుంద‌ని, వీఐపీల ప్రైవ‌సీల విష‌యంలో వారిని అంద‌లం ఎక్కిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో యూజ‌ర్ల భ‌ద్ర‌తే త‌మ‌కు ముఖ్య‌మ‌ని తెలియ‌జేసేందుకు ఫేస్‌బుక్ పేరును మార్చుకోబోతున్న‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.  అక్టోబ‌ర్ 28 వ తేదీలోగా ఫేస్‌బుక్ త‌న పేరును మార్చే అవ‌కాశం ఉంది.  

Read: వ‌చ్చే ఏడాది నుంచి భార‌త్‌లో బూస్ట‌ర్ డోసు…

Related Articles

Latest Articles