విడుదలైన ‘రియ‌ల్ దండుపాళ్యం’ ట్రైల‌ర్

రాగిణి ద్వివేది, మేఘ‌న రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, క‌న్నడ భాష‌ల్లో రూపొందిన చిత్రం ‘రియ‌ల్ దండుపాళ్యం`. మ‌హేష్ ద‌ర్శక‌త్వంలో సి.పుట్టస్వామి, రామ్‌ధ‌న్ మీడియా వ‌ర్క్స్ కలిసి దీనిని నిర్మించారు. ఈ నెల 21న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాత, జర్నలిస్ట్ సురేశ్ కొండేటి విడుదల చేశారు.నిర్మాత వాల్మీకి మాట్లాడుతూ ‘తెలుగు, క‌న్నడ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ స‌క్సెస్ అయింది. ఇప్పుడు వాటిని మించేలా రియ‌ల్ దండుపాళ్యం ఉండ‌బోతుంది. మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు
అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’. ప్రతి స‌న్నివేశాన్ని సహజంగా తెర‌కెక్కించాడు ద‌ర్శకుడు మ‌హేష్. మంచి సౌండ్ సిస్టమ్ తో థియేట‌ర్స్ లో చూడాల్సిన చిత్రం కాబ‌ట్టి థియేట‌ర్స్ లోనే రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రాన్ని ఆద‌రించి మ‌రెన్నో చిత్రాలు నిర్మించే అవ‌కాశం క‌ల్పిస్తార‌ని కోరుకుంటున్నా’ అన్నారు.

Related Articles

Latest Articles