ఐపీఎల్ 2021 : మొదటి మ్యాచ్ లో బ్లూ జెర్సీ ధరించనున్న ఆర్సీబీ

కరోనా కారణంగా గత ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే భారత్ లో ఇప్పటికి కరోనా కేసులు తగ్గకపోవడంతో ఈ సీజన్ లో మిగిలినమచ్ లను ఈ నెల 19 నుండి యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇక ప్రస్తుతం అన్ని ఐపీఎల్ జట్లు కూడా యూఏఈ చేరుకున్నాయి. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవరిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఓ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో ఆర్సీబీ జట్టు మొదటి మ్యాచ్ ఈ నెల 20 న కేకేఆర్ తో తలపదనుంది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు అందరూ బ్లర్ జెర్సీ వేసుకోనున్నారు. ఈ కరోనా సమయంలో ప్రజల రక్షణకోసం ముందున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కృషికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే బెంగళూర్ ఈ సీజన్ లో ఇప్పటివరకు ఏడూ మ్యాచ్ లు ఆడగా అందులో 5 విజయం సాధించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానములో ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-