సంధ్య శ్రీధరరావుకి ఉచ్చు బిగుస్తోందా?

గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావుపై ఉచ్చుబిగుస్తోందా? ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు సంధ్య శ్రీధరరావు బాధితులు. ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లో 16 పైగా కేసు నమోదయ్యాయి.నార్సింగి,రాయదుర్గం, గచ్చిబౌలి ,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ,మియాపూర్ లో శ్రీధరరావు పై కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాయదుర్గం భవన వ్యవహారం సంబంధించి చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో చైతన్య రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు. పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చైతన్య. రాయదుర్గం ఏరియా లో రేట్లు పెరిగి పోవడంతో చైతన్యని బెదిరించాడు శ్రీధర్ రావు.

రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తన పేరుమీద చేయాలంటూ చైతన్య పై ఒత్తిడి తెచ్చాడు శ్రీధర్. శ్రీధర్ బెదిరింపులకు లొంగలేదు చైతన్య . ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పేరుతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నాడు శ్రీధర్ రావు. ఆక్యుపెన్సీ ఆడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయల జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టాడు శ్రీధర్ రావు. చైతన్య రిజిస్ట్రేషన్ చేసిన రెండు ప్లాట్స్‌ని మరొక సంస్థకు అమ్మేశాడు శ్రీధర్ రావు. అతని అక్రమాలపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు చైతన్య. ఈ ఫిర్యాదుతో శ్రీధరరావు పై కేసులు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు రాయదుర్గం పోలీసులు.

Related Articles

Latest Articles