అప్డేట్ : షూటింగ్ రీస్టార్ట్ చేయనున్న “ఖిలాడీ”

ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read Also : నితిన్ ఫ్లాప్ సినిమాకే ఎక్కువ టిఆర్పీ !!

తాజాగా ఈ సినిమా మేకర్స్ అప్డేట్ ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. జూలై 26న “ఖిలాడీ” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ పోస్టర్లో రవితేజ సీరియస్ గా ఖరీదైన బ్రాండ్ న్యూ బైక్ నడుపుతూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. మరోవైపు రవితేజ, శరత్ మాండవ దర్శకత్వంలో “రామారావు ఆన్ డ్యూటీ” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-