రవితేజ ‘రావణాసుర’ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్

‘క్రాక్’ సక్సెస్‌ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ దశలో ఉంది. రవితేజ 70వ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. దీనికి ఇప్పటికే ‘రావణాసుర’ అనే పవర్‌ ఫుల్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ తాజాగా ముహుర్తాన్ని ఖరారు చేశారు.

Read Also : బాలయ్య నెక్స్ట్ సినిమా డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, ఉదయం 9:50 గంటలకు ముహూర్తం ఉందని ‘రావణాసుర’ బృందం ప్రకటించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ వేడుకకు వేదికైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ‘రావణాసుర’ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకాంత్ విస్సా కథ రాశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related Articles

Latest Articles