థియేటర్లోనే ‘ఖిలాడి’.. అధికారిక ప్రకటన

మాస్ మహారాజా ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ర‌మేష్ వ‌ర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌నే జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే వీటిని కొట్టిపారేస్తూ చిత్రబృందం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కరోనా వేవ్ తగ్గాక మూవీని థియేటర్లోనే రిలీజ్​ చేస్తామని స్పష్టం చేసింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-