తమిళనాడు గవర్నర్ గా రవిశంకర్ ప్రసాద్

తమిళనాడు గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మొత్తం 11 మంది కేంద్ర మంత్రులను మంత్రి మండలి నుంచి తొలగించారు. వారిలో రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. కేబినెట్ విస్తరణకు కొద్ది గంటల ముందే రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయడం ఆసక్తి కల్గించింది. ఇప్పటివరకూ తమిళనాడు గవర్నర్‌గా బన్వర్ లాల్ పురోహిత్ వ్యవహరించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-