సొంత అన్నతోనే సంబంధం పెట్టుకున్నానన్నారు- స్టార్ హీరోయిన్

సినిమా .. ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ చూసేవి అన్ని నిజం కాదు.. గ్లామర్ ని ఒలకబోసే హీరోయిన్లందరూ చెడ్డవారు కాదు. సినిమా వారికి ఒక వృత్తి మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో చెప్తూనే ఉంటుంది. ఇక కెరీర్ మొదట్లో ఒక హీరోయిన్ పడే స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ఎన్నో ఇబ్బందులు.. ఎన్నో అవమానాలు వారిని వెంటాడుతాయి. వాటిని వారు సక్సెస్ అయ్యాకా గత జ్ఞాపకాలుగా నెమరువేసుకుంటూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూడా ఇదే పని చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన జీవితంలో ఎన్నో నిద్ర లేని రాతులను గడిపినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఎన్నో అవమానాలను ఎదుర్కొనట్లు తెలిపింది.

” ఒకప్పుడు నేను నిద్ర పోవడానికి ఎంతగా ఏడ్చేదాన్నో.. ఎందుకంటే రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు. దానికి కారణం జర్నలిస్టులు. అప్పట్లో వారికి మేము భయపడుతూ బతికే వాళ్ళం. రవీనా కో స్టార్స్ తో చనువుగా ఉంటె వారికీ నచ్చేది కాదు. దీంతో ఎవరికెవరికో నన్ను కలుపుతూ రూమర్స్ పుట్టించేవారు. చివరికి నా సొంత అన్నతో కూడా సంబంధం అంటకట్టారు.. రవీనాను డ్రాప్ చేసిన ఆ అందమైన అబ్బాయే ఆమె ప్రియుడు.. మేము రవీనా బాయ్ ఫ్రెండ్ ని కనిపెట్టేశాం అంటూ హెడ్ లైన్స్ వేసేవాళ్ళు.. అప్పుడు నేను చాలా కృంగిపోయాను. ఆ సమయంలో అస్సలు నిద్రపట్టేది కాదు. ఎప్పుడు, ఎవరు నా మీద ఎలాంటి వార్తలు రాస్తారో అని భయపడుతూ కూర్చొనేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles