‘రావణాసుర’ సంక్రాంతి పోస్టర్.. మాస్ మహారాజా ఊర మాస్ లుక్

మాస్ మాహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో  అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా పూజ కార్యక్రమాలను నేడు ఘనంగా జరుపుకొంటుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తాజగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని మేకర్స్ కొత్త పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 న ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు తెలిపారు.

ఇక పోస్టర్ లో మాస్ మహారాజా పేరుకు తగ్గట్టే ఊర మాస్ లుక్ లో కనిపించారు. లాయర్ డ్రెస్ లో నోట్లో ఉన్న సిగార్ ని వెలిగిస్తూ కనిపించాడు. ముఖ్యంగా ఆ లాయర్ డ్రెస్ మీద రక్తపు మరకలు చూస్తుంటే.. ఈ పోస్టర్ ఫైట్ సీన్లో తీసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పది గెటప్పుల్లో కనిపించనున్నట్లు టాక్. ఇకఈ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి పోస్టర్స్ తోనే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles