తెలంగాణలో రేపటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ

రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ తెలిపింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు శనివారానికి బదులుగా మంగళవారం నుంచి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీ నుంచి రేషన్‌ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

Read Also: మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి : సీఎం కేసీఆర్‌

ప్రతి కార్డుపై 10 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 6,10,866 ఆహార భద్రత కార్డులు, రంగారెడ్డి 6, 55, 957 కార్డులు, మేడ్చల్ జిల్లాలో 5,24, 594 కార్డులు ఉన్నాయి. కాగా రేషన్ డీలర్లలో కొందరు కరోనా బారిన పడటంతో వారి స్థానంలో కొత్తగా ఎవరిని నియమించలేదని.. ఉన్న సిబ్బందే అదనంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని కొందరు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles