“మహాసముద్రం” క్లాసీ సాంగ్ రిలీజ్ కు టైం ఫిక్స్

శర్వానంద్, సిద్ధార్థ్, అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం” షూటింగ్ జూలై 9న పూర్తయింది. ఇంటెన్స్ లవ్ స్టోరీ “మహా సముద్రం” రాజమౌళి “ఆర్ఆర్ఆర్”తో ఢీకొంటుంది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయిన ఒకరోజు తరువాత థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, గరుడ రామ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “మహా సముద్రం”కు సినిమాటోగ్రఫీ రాజ్ తోట, ఎడిటింగ్ ప్రవీణ్ కేఎల్, సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 14న థియేటర్లలోకి రానుంది.

Read Also : నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ… “జాతిరత్నం”కు నాని పంచ్

ఈ సినిమా నుంచి క్లాసీ లవ్ సాంగ్ ను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. “చెప్పకే చెప్పకే” అనే పాటను రేపు ఉదయం 10.35 గంటలకు రష్మిక మందన్న రిలీజ్ చేయబోతోంది అంటూ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ ప్రేమ పాట అదితి పోషించిన ‘మహా’ పాత్ర మీద చిత్రీకరించబడింది. ఈ యాక్షన్ డ్రామాతో సిద్ధార్థ్ దాదాపు 8 సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కి తిరిగి రాబోతున్నాడు.

Image

Related Articles

Latest Articles

-Advertisement-