చర్చనీయాశంగా మారిన రష్మిక ఇంటిపేరు

టాలీవుడ్ లో రష్మిక హాట్ కేక్. ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా హీరోయిన్ గా ముందు పరిశీలనలోకి వచ్చే పేరు రష్మిక. ఇక బాలీవుడ్ లోనూ అమ్మడి పేరు మారుమ్రోగుతోంది. 2020లో నేషనల్ క్రష్‌గా మారినప్పటి నుండి హాట్ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ప్రతి వార్త దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రష్మిక ఇంటిపేరు గతంలో కూడా చర్చకు దారితీసినప్పటికీ ఇటీవల ఆమె షేర్ చేసిన పాస్ పోర్ట్ ఫోటో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్మిక షేర్ చేసిన బోర్డింగ్ పాస్ లో రష్మిక మందన్న చివరి పేరు ముందచాదిర అని ఉంది.

రష్మిక తండ్రి పేరు మదన్ మందన్న ముందచాదిర. ఈ ఇంటిపేరు ముందచాదిర వెనుకటి చరిత్ర గురించి తెలుసుకోవడానికి పలువురు ఆసక్తిని కనబరుస్తున్నారు. రష్మిక కర్నాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన యువతి. ఆ ప్రాంతాన్ని పాలించిన కొడగు రాజవంశాలకు సంబంధించిన వంశపారంపర్య వ్యక్తులకు మాత్రమే ఇలా ముందచాదిర అనే ఇంటిపేరు ఉంటుందని రష్మిక హార్డ్ కోర్ అభిమానులు చెబుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వంశానికి చెందిన వారు ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించారు. కొందరు కొడగు యోధులు, నాయకుల గొప్పతనాన్ని ఇప్పుడు రష్మికకే ఆపాదిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ట్విట్టర్, ఇన్‌స్టాలో ముందచాదిర అనే ఇంటిపేరు గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి ఈ చర్చకు ఎప్పుడు ఎలా పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Related Articles

Latest Articles