రష్మిక ప్యారిస్ ట్రిప్… అక్కడ జరిగింది ఏంటో రివీల్ చేసిన బ్యూటీ

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ప్యారిస్ లో క్వాలిటీ టైం స్పెండ్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న రష్మిక అక్కడ జరిగిందేంటో కూడా రివీల్ చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యారిస్ ట్రిప్ పిక్స్ షేర్ చేస్తూ “ప్రియమైన డైరీ పారిస్‌లో నా మొదటి రోజు ఇలా ఉంది. నేను నా ప్యారిస్ ట్రిప్‌ ను ఫోటో డంప్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం జరిగిందో మీకు టెక్స్ట్ ద్వారా చెప్పడం కంటే… చూపిస్తాను” అంటూ రాసుకొచ్చింది.

Read Also : “ఆర్ఆర్ఆర్” రికార్డుల వేట స్టార్ట్… లాంగెస్ట్ ట్రైలర్

రష్మిక సినిమాల విషయానికొస్తే సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్‌” మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను 2021 డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. నిన్న విడుదలైన “పుష్ప: ది రైజ్” ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది. హిందీ స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను”తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుంది. శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2022 మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్‌బై”లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తో కలిసి కనిపించనుంది.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Related Articles

Latest Articles