చరణ్-శంకర్ సినిమా: కథానాయిక అనౌన్స్ మెంట్ వచ్చేస్తోంది!

ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు సంబంధించి అన్ని విభాగంలోని అప్డేట్స్ వచ్చేశాయి. ఇక అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా కథానాయిక పేరు కూడా అతిత్వరలోనే రానుంది. ఇప్పటికే చిత్రబృందం పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టాలీవుడ్ లక్కీ గర్ల్ గా పేరొందిన రష్మిక మందాన మరోసారి తాను ఎంత లక్కీనో చెప్పబోయే అనౌన్స్ మెంట్ తొందరలోనే రాబోతుంది. రాంచరణ్ సరసన రష్మిక దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా రాజకీయాలు నేపథ్యంతో తెరకెక్కనుండగా.. రామ్ చరణ్ ఒక స్టూడెంట్ లీడర్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. ఇక శంకర్ సినిమాలో హీరోయిన్స్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. ఈ చిత్రంలోనూ రష్మిక బలమైన పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రీసెంట్ గా మాటల రచయితగా బుర్రా సాయి మాధవ్, కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ను ప్రకటించగా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ కంపోజర్ గా తీసుకున్నారు. ఇక చరణ్ ను ఢీకొట్టబోయే ప్రతినాయకుడి పేరు కూడా వెలువడాల్సి వుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-