దాని కోసం సమయాన్ని వెచ్చించండి: రష్మిక

నటి రష్మిక మందన చేసింది తక్కువ సినిమాలే అయిన తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆమె చేసిన ప్రతి సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వడంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా కరోనా వేవ్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వారికీ సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలోనూ వరుసగా నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్ను’, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది. కాగా తాజాగా రష్మిక ఓ సందేశాన్ని అభిమానులతో పంచుకుంది. ‘మీకు నచ్చిన దానికోసం సమయాన్ని వెచ్చించండి. అది మీకు కావాల్సిన ఆనందాన్ని.. సంతోషాన్ని ఇస్తుందని’ తెలిపింది. ఈ విషయం నా స్నేహితుడు షేర్ చేశాక.. తనలో చాలా మార్పును చూశానని తెలిపింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-