‘భీష్మ’ బ్యూటీ ఒళ్లో… లిటిల్ బేబీ!

‘’ హే గైస్! ప్రస్తుతం నెలకొన్న ఈ మొత్తం గందరగోళం మధ్యలోనే… నాకు ఈ ఆనందకరమైన చిరు నేస్తం లభించింది. ఇదే నన్ను ఒత్తిడికి లోను కాకుండా కాపాడింది. ‘ఆరా’ని మీకు ఇవాళ్ల పరిచయం చేస్తున్నాను! అయితే, మూడు సెకన్లలో ప్రేమలో పడిపోతామని కొందరు అంటుంటారు. కానీ, ఈ క్యూటీ నా మనసుని 0.3 మిల్లీ సెకన్లలోనే దోచేసింది! ‘’ ఏంటి ఇదంతా అంటారా? రశ్మిక సొషల్ మీడియా పోస్ట్! ఆమె మాట్లాడుతోన్నది ‘ఆరా’ అనే తన న్యూ పెట్ డాగ్ గురించి! కొత్తగా తమ ఫ్యామిలీలో చేరిన లిటిల్ మెంబర్ ని తెగ ముద్దు చేస్తోంది ‘భీష్మ’ బ్యూటీ. లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉండాల్సి వస్తోన్న తనకు ఎంతో ఆనందం పంచుతోందట కుక్క పిల్ల!

అంతే కాదు, ఇలా చూడగానే అలా మనసుదోచిందట లిటిల్ డాగీ!ఎవరూ ఊహించని విధంగా మన మీదకొచ్చిపడ్డ కరోనా కల్లోలం అందర్నీ ఇబ్బంది పెడుతోంది. అయితే, చాలా మంది తమ పెట్ డాగ్స్, క్యాట్స్ తో కాలం గడుపుతున్నారు. నాలుగ్గోడల మధ్య ఉన్నా వాటితో అనుబంధం పెంచుకుంటూ మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ లిటిల్ కంపానియన్స్ తో సొషల్ మీడియాలో హల్ చల్ చేసేశారు. లెటెస్ట్ లేడీ ఇన్ ద లిస్ట్… రశ్మిక!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-