కిల్లింగ్ లుక్ లో శ్రీవల్లీ .. ‘పుష్ప’ ఏంటి ప్రతి ఒక్కరూ పడిపోవాల్సిందే

చూపే బంగారామాయనే .. శ్రీవల్లీ అంటూ పుష్ప ని వెంట తిప్పించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. డీ గ్లామరైజెడ్ రోల్ లో రష్మిక అదరగొట్టేసింది. ఇక పుష్ప విజయంతో మంచి జోష్ లో ఉన్న అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లను కుర్రాళ్లమీదకు వదిలింది. తాజాగా రష్మిక కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆ డ్రెస్ లో తన లుక్ ఎలా ఉందని అభిమానులను చెప్పమని కోరింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లాంగ్ గౌన్ లో కిల్లింగ్ లుక్ తో రష్మిక మెరిసిపోతుంది. బంగారు వర్ణంలో ఉన్న ఆ డ్రెస్ రష్మిక అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇక ఈ లుక్ లో శ్రీవల్లీ ని చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇలా ఉంటే పుష్పకి ఏంటీ .. ప్రతి ఒక్కరు పడిపోవాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles