రష్మిక యూఎస్ ప్రయాణం అతన్ని కలవడానికేనా ?

కన్నడ క్రష్ రష్మిక మందన్న తాజాగా షేర్ చేసిన పిక్స్ ఆమెను మరోసారి ముఖ్యాంశాల్లో నిలిచేలా చేశాయి. తన ఇన్‌స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం? అని అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొంటూ ఆమె విమాన ప్రయాణం, పాస్‌పోర్ట్ చిత్రాలను పంచుకుంది. ఆమె దీన్ని షేర్ చేసినప్పటి నుండి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్మిక అభిమానులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆమె ఆన్‌లైన్‌లో షేర్ చేసిన చిత్రాలలో ఒకదానిలో “ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్నా.. నేను త్వరలో తిరిగి వస్తాను” అని రాసింది.

అయితే రష్మిక యునైటెడ్ స్టేట్స్ వెళ్లిందని, అక్కడ పూరి జగన్నాధ్ “లైగర్” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా యుఎస్‌ షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్న తన సహనటుడు, బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను కలవడానికి రష్మిక అక్కడికి వెళ్ళింది అంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు రష్మిక ‘లైగర్’ గెస్ట్ రోల్ లో కన్పించబోతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Read Also : ఎన్టీఆర్ ట్రస్ట్ వర్సెస్ హనుమ విహారి ఫౌండేషన్… సారీ చెప్పాలంటూ డిమాండ్

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు. తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు, ఊహాగానాలు వస్తున్నప్పటికీ, వీరిద్దరూ తాము కేవలం స్నేహితులు మాత్రమేనని, అంతకుమించి ఏమీ లేదని తేల్చి చెప్పారు. ముంబై దేవరకొండ, రష్మిక తరచుగా కలవడం, ఒకే జిమ్‌లో వర్కౌట్‌లు చేయడం వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి.

రష్మిక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ మాగ్నమ్ ఓపస్ మూవీ “పుష్ప” చిత్రం విడుదలకు కోసం ఎదురు చూస్తోంది. బాలీవుడ్‌లో “మిషన్ మజ్ను”, “గుడ్‌బై” సినిమాలు చేస్తోంది. మరోవైపు కరణ్ జోహార్ సపోర్ట్ తో “లైగర్‌” మూవీ ద్వారా విజయ్ తన బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు.

Related Articles

Latest Articles