మెగా ఆఫర్… ఆమె కెరీర్ ‘జబర్దస్త్’ అవుతుందా ?

‘జబర్దస్త్’ బ్యూటీ రష్మికి మెగా ఛాన్స్ వచ్చింది అనే వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం యాంకర్, నటి రష్మీని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి!

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా రూపొందనున్న “భోళా శంకర్‌”లో చిరు కథానాయికగా తమన్నా నటిస్తుండగా, మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ‘వేదాళం’ మాదిరిగానే భోళా శంకర్” కథ కూడా కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది కాబట్టి సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ఈ ఐకానిక్ సిటీలో జరుగుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించగా, డడ్లీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మీకి ఆఫర్ రావడం అంటే అదృష్టం తలుపు తట్టినట్టే. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే స్వయంగా చిరంజీవి ఈ పాట కోసం రష్మీని తీసుకోమని మేకర్స్‌ని అడిగారట. ఈ వార్తపై మేకర్స్ నుంచి రెస్పాన్స్ లేదు. కానీ ఇదే గనక నిజమైతే రష్మీ లైఫ్ ‘జబర్దస్త్’ అయినట్టే !

Related Articles

Latest Articles