అపోలో ఆస్పత్రికి రాశిఖన్నా, జయప్రద

టాలీవుడ్ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ నిన్న రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఆ తర్వాత వైద్యానికి స్పందించారు. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాయి తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న సినీనటులు ఆయన్ను చూడ్డానికి ఆస్పత్రికి చేరుకొంటున్నారు. తాజాగా రాశిఖన్నా, జయప్రద అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తేజూ ఆరోగ్యంపై అడిగి తెలుసున్నారు. అనంతరం కుటుంబసభ్యులతో కాసేపు గడిపారు.

సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ఇంటర్నల్‌గా ఎటువంటి గాయాలు లేవు. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. అంతర్గత అవయవాల్లో ఎలాంటి బ్లీడింగ్‌ లేదు. కాలర్‌బోన్‌ గాయానికి శస్త్ర చికిత్సను రేపు పరిశీలిస్తాం. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Related Articles

Latest Articles

-Advertisement-