తిరుపతి ఆసుపత్రిలో అరుదైన చికిత్స…

తిరుపతి అంకుర ఆసుపత్రిలో అరుదైన చికిత్స అందించారు వైద్యులు. కాటుక డబ్బా మింగేసిన ఓ 9 నెలల బాలుడిని కాపాడారు వైద్యులు. బాలుడు నెల్లూరు జిల్లా డక్కలి మండలం ఎంబులూరు వాసి. ఆడుకుంటూ కాటుక డబ్బా రోహిత్ మింగేయడంతో అతని స్వరపేటికలో ఇరుక్కుపోయింది కాటుక డబ్బా. అయితే ల్యారింగో స్కోపి ద్వారా కాటుక డబ్బా ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు అంకుర ఆసుపత్రి వైద్యులు. ఈ చికిత్స విధానాన్ని మీడియాకు వెల్లడించిన అంకుర ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ వంశీకృష్ణ.

-Advertisement-తిరుపతి ఆసుపత్రిలో అరుదైన చికిత్స...

Related Articles

Latest Articles