నైజీరియాలో వింత గొర్రె…ఐదు కొమ్ముల‌తో ప్ర‌త్య‌క్షం…

ఈ భూప్ర‌పంచంలో అనేక వింత‌లు విశేషాలు ఉన్నాయి.  కొన్ని వింతలు వినోదాన్ని క‌లిగిస్తే మ‌రికొన్నిమాత్రం ఆలోచ‌న‌ల‌ను, భ‌యాన్ని క‌లిగిస్తాయి.  ముస్లింలు ఎక్కువ‌గా జ‌రుపుకునే పండుగ బ‌క్రీద్‌.  ఆ పండుగ రోజున గొర్రెను బ‌లి ఇస్తుంటారు.  ప్ర‌పంచంలో ఆ రోజుల గొర్రెల కొనుగోలు ఆమ్మాకాలు అధికంగా జ‌రుగుతుంటాయి.  అయితే, నైజీరియాలోని లాగోస్ మార్కెట్‌కు ఓ వ్య‌క్తి గొర్రెను అమ్మేందుకు తసుకొచ్చారు.  సాధార‌ణంగా గొర్రెలకు రెండు కొమ్ములు ఉంటాయి.  కానీ, ఈ గొర్రెకు రెండు కాకుండా ఐదు కొమ్ములు ఉన్నాయి. చూడ‌టానికి అది అచ్చంగా స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ త‌ల‌పై ఉన్న కిరీటం మాదిరిగా ఉండ‌టంతో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. గొర్రెల‌ను కొనుగోలు చేసేందుకు వ‌చ్చినవారు ఆ గొర్రెతో ఫోటోలు దిగారు.  వీడియోలు తీసుకున్నారు.  ప్ర‌స్తుతం దానికి సంబందించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

Read: ‘రోబో’తో బాలీవుడ్ బేబీ మరోసారి రొమాన్స్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-