లొకేషన్స్ వేటలో “రాపో 19”

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “రాపో19″లో నటిస్తున్న విషయం విదితమే. “రాపో19” అనేది ద్విభాషా ప్రాజెక్ట్. ఇందులో రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తాజాగా సినిమాకు సంబంధించిన అప్డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Read Also : “లైగర్”కు బాలయ్య సర్ప్రైజ్

చిత్ర నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ “రాపో19″కు సంబంధించిన లొకేషన్స్ వేట జరుగుతోంది అంటూ ఓ చిన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందులో మూవీ సెకండ్ షెడ్యూల్ కోసం లొకేషన్లను చూస్తున్నారు మేకర్స్. “ప్రయాణం కొనసాగుతోంది… రాపో19 రెండవ షెడ్యూల్ కోసం లొకేషన్ వేట ముమ్మరంగా సాగుతోంది. ఎందుకంటే అందమైన నేపథ్యాలలో గొప్ప కథలు చెప్పాల్సిన అవసరం ఉంది” అంటూ ఆ వీడియోను షేర్ చేశారు.

-Advertisement-లొకేషన్స్ వేటలో "రాపో 19"

Related Articles

Latest Articles