రెండు పోనీటైల్స్ తో రణవీర్

తమ ప్రతి కదలికలపై మీడియా కన్ను పడుతుండటంతో నటీనటులు వేషధారణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అయితే ఫ్యాషన్ యుగంలో ప్రత్యేకతను చాటుకోవటానికి ఎంతో ఇష్టపడుతుంటాడు. గతంలోనూ పలు రకాల గెటప్ లతో, వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా రామ్ చరణ్, శంకర్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవారిని ముఖ్య అతిథిగా విచ్చేశాడు రణవీర్. ఈ వేడుకకు రణవీర్ బ్లాక్ బ్లేజర్ ధరించి వచ్చాడు. ఇక అందరినీ ఆకట్టుకున్నది అతని హెయిర్‌స్టైల్. రణ్‌ వీర్ రెండు పోనీటెయిల్స్‌ వేసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరి దృష్టి రణ్‌ వీర్ పోనీ టెయిల్స్ మీదే పడిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమానికి రణ్‌వీర్‌తో పాటు చిరంజీవి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Read Also : ‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్ కు తొలగిన అడ్డంకి

Related Articles

Latest Articles

-Advertisement-