సల్మాన్ కు రణవీర్ షోల్డర్ మసాజ్! ఏంటి మెసేజ్ అంటోన్న నెటిజన్స్…

సల్మాన్ ఖాన్ భుజాలు నొక్కుతూ రణవీర్ సింగ్ మసాజ్ చేశాడు! ఇప్పుడు ఇదే టాపిక్ ఇంటర్నెట్ లో హాట్ గా మారింది! సల్మాన్ ఫ్యాన్స్, రణవీర్ ఫ్యాన్స్ ఇద్దరూ ఒకే ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు!
విషయం ఏంటంటే… సల్మాన్ ‘రేస్ 3’ షూటింగ్ లో పాల్గొంటోన్న సమయంలో రణవీర్ ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లాడు. సాధారణంగా మయ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండే ఆయన ‘రేస్ 3’ టీమ్ మొత్తాన్ని కాస్సేపు హంగామాలో ముంచేశాడు. ‘రేస్ 3’ యూనిట్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. అయితే, ఇదంతా జరిగింది 2017లో. అప్పట్లో కొన్ని చిత్రాల్ని స్వయంగా ‘రేస్ 3’ నిర్మాత రమేశ్ తౌరానీ ట్విట్టర్ లో షేర్ చేశాడు…
‘రేస్ 3’ రేమో డిసౌజా దర్శకత్వంలో 2018లో విడుదలైంది. సల్మాన్ కెరీర్ లోని ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో నిస్సందేహంగా చేరిపోయింది. అయితే, అప్పటి సల్మాన్ అండ్ రణవీర్ ఫోటోస్ ఇప్పుడు మళ్లీ వైరల్ కావటమే కొంచెం ఆశ్చర్యం. ఎందుకోగానీ, ఇద్దరు హీరోల అభిమానులు ‘రేస్ 3’ నాటి ఫోటోలపై ఇప్పుడు చర్చ పెడుతున్నారు. చూడాలి మరి, రణవీర్ సింగ్ తో బాలీవుడ్ భాయ్ జాన్ త్వరలో ఏదైనా సినిమా చేస్తాడేమో! బాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ టాలీవుడ్ లో కన్నా ఎక్కువే…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-