రణవీర్, ఆలియా, కరణ్ … ఏక్ ‘ప్రేమ్ కహానీ’!

ఎక్కడ పొగొట్టుకున్నాడో… అక్కడే వెదుక్కోవాలని, వెదికి పట్టుకోవాలని… కరణ్ జోహర్ డిసైడ్ అయినట్టున్నాడు! ఎందుకలా అనిపించింది అంటారా? ఆయన నెక్ట్స్ మూవీ డిటైల్స్ వింటే మీకే తెలుస్తుంది!

కరణ్ జోహర్ అంటే ఒకప్పుడు టిపికల్ బాలీవుడ్ ఇస్టైల్ లవ్ స్టోరీస్! అమ్మాయి, అబ్బాయి, కామెడీ, ప్రేమ, కొంచెం ఎమోషన్, చివర్లో హ్యాపీ ఎండింగ్! ఇంతే… ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ దాదాపుగా అలానే ఉండేవి! కానీ, ఏజ్, క్రేజ్ పెరుగుతున్న కొద్దీ కరణ్ తన రొమాంటిక్ కామెడీస్ కి దూరమయ్యాడు. మళ్లీ మళ్లీ లవ్ స్టోరీసే తీసినా కూడా ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాలు ట్రై చేశాడు. సూటిగా మాట్లాడుకుంటే, అవేవీ కరణ్ జోహర్ కి పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆయన గత చిత్రం రణబీర్, ఐశ్వర్య, అనుష్క శర్మ కాంబినేషన్ లో వచ్చిన ‘యే దిల్ హై ముష్కిల్’. కేజో స్థాయికి తగిన బాక్సాఫీస్ విజయం దక్కించుకోలేకపోయింది!

దర్శకుడిగా భారీ విజయాలు అందుకోలేకపోతోన్న కరణ్ జోహర్ రియల్ లైఫ్ లో రకరకాల గొడవల్లో ఇరుక్కుంటున్నాడు. కంగనా ఆరోపణలు, సుశాంత్ మరణం, నెపోటిజమ్ పేరుతో నిత్యం సొషల్ మీడియాలో ట్రోలింగ్… ఇవన్నీ రచ్చకి కారణం అవుతున్నాయి. అందుకే, తాను ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పీరియాడికల్ డ్రామా ‘తఖ్త్’ కరణ్ మూలన పెట్టేశాడు. ఒకప్పటిలా తనకు అచ్చివచ్చిన ఫార్మాట్ లో రొమాంటిక్ కామెడీకి రెడీ అవుతున్నాడు!

రణవీర్, ఆలియా జంటగా ‘ప్రేమ్ కహానీ’ అనే సినిమా తీస్తాడట కరణ్. డైరెక్టర్ గా నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఆయన మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. ఈసారి ఎలాంటి రిస్క్ లేకుండా సింపుల్ లవ్ స్టోరీ చెబుతాడట. దానికి ఎలాగూ మంచి మ్యూజిక్ దట్టిస్తాడు. ఇక ఇండియన్ ఆడియన్స్ కు నచ్చే బాలీవుడ్ మార్కు కామెడీ కూడా ఉంటుందట! ఇంతగా సేఫ్ గేమ్ ప్లే చేశాక సినిమా ఆడకుండా ఉంటుందా? తప్పకుండా ఆడుతుంది అంటున్నారు బాలీవుడ్ జనం! కరణ్ జోహర్ ఏ జానర్ లో పొగొట్టుకున్నాడో… అదే జానర్ లో వెదుక్కుంటున్నాడు… అని కూడా అంటున్నారు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-