ఆర్‌.ఆర్‌.ఆర్‌ను సరైన సమయంలో విడుదల చేస్తాం: రాంచరణ్

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా RRR రిలీజ్ పోస్ట్ పోన్ పై హీరో రామ్ చరణ్ స్పందించారు. రౌడీ బాయ్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రాంచరణ్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌ విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు కానీ దిల్ రాజుకు చాలా ముఖ్యం. సినిమా పెద్దలు రాజమౌళి, దానయ్య ఉన్నారు సో వాళ్ళు చూసుకుంటారు. మూడేళ్ళు ఒక సినిమా కోసం కష్టపడ్డాం సో వేచి చూడడంలో తప్పులేదన్నారు రాం చరణ్‌. సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తుందంటూ రాంచరణ్‌ కామెంట్స్‌ చేశారు.

Read Also: ఊగిసలాటలో చిత్రశుక్లా ‘ఉనికి’!

నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఇప్పటి వరకు వ‌ర‌కు రిలీజ్ కాలేదంటే.. కార‌ణం, కోవిడ్ ప్రభావమే. 1920 బ్యాక్‌డ్రాప్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న చిత్రం RRR. చరిత్రలో కలుసుకోని ఇద్దరూ యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఊహాత్మాక కథనంతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో డివివి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కొముంర భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడి త‌దిత‌రులు న‌టించారు

Related Articles

Latest Articles