హృతిక్, రణబీర్ తో ‘రామాయణం’

బాలీవుడ్ హ్యాండ్ సమ్ హాంక్స్ హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ కలయికలో సినిమా ఖాయం అని తేలింది. శనివారం వీరిద్దరూ ఓ నిర్మాతను కలిశారు. ఆ ఫోటోలు బయటకు రావటంతో వారిద్దరి కలయికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. హృతిక్, రణబీర్ నమిత్ మల్హోత్రా కార్యాలయాన్ని సందర్శన వారు తీస్తున్న పురాణ కథ ‘రామాయణం’ కోసమే అని అందరూ నమ్ముతున్నారు. నమిత్, మధు మంతెన, దర్శకుడు నితేష్ తివారీతో వీరు సమావేశం అయినట్లు సమాచారం. గతంలో 500 కోట్ల బడ్జెట్ తో ‘రామాయణం’ సినిమాను మధు మంతెన, అల్లు అరవింద్, నమిత్ నిర్మిస్తారని వినిపించింది. దీనికి నితీష్ తివారీ, రవి ఉడయవర్ దర్శకులు. హృతిక్ రోషన్ రావణునిగా, రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపిస్తారట. శనివారం మీటింగ్ తో ఎప్పటి నుంచి షూటింగ్ జరపాలనే విషయమై చర్చలు జరిగాయట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమవుతుందని అంటున్నారు. సీతగా ఎవరు నటిస్తారనే దానితో పాటు ఇతర నటీనటుల వివరాలను దిపావళికి ప్రకటిస్తారట. ప్రస్తుతం హృతిక్ ‘విక్రమ్ వేద’ షూటింగ్ కోసం అబుదాబి వెళుతున్నాడు. అలాగే రణబీర్ పదిరోజుల ‘బ్రహ్మాస్త’ షూట్ అనంతరం దర్శకుడు లవ్ రంజన్ తదుపరి చిత్రం చేయనున్నాడు.

-Advertisement-హృతిక్, రణబీర్ తో 'రామాయణం'

Related Articles

Latest Articles