రానా ప్రొడక్షన్స్: విశాల్ పాన్ ఇండియా మూవీ ప్రారంభం

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు టాలీవుడ్ లోను మంచి మార్కెట్ వున్నా విషయం తెలిసిందే.. ఆయన ప్రతి సినిమాను తెలుగులోనూ డబ్ అయ్యేలా చూసుకుంటాడు. ‘పందెం కోడి, పొగరు, భరణి, వాడు వీడు, అభిమన్యుడు, డిటెక్టివ్ వంటి సినిమాలతో తెలుగు అభిమానులను అలరించాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాల్లో నటిస్తుండగా.. తాజాగా విశాల్ తన 32వ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.

ఆగస్ట్ 29న విశాల్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని ప్రముఖ సాయిబాబా ఆలయంలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని తాజాగా విడుదల చేశారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు రమణ – నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన సునయన హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘వేటాడు వెంటాడు’ సినిమాలో నటించారు.

Related Articles

Latest Articles

-Advertisement-